News April 5, 2025

NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

image

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.

Similar News

News December 21, 2025

టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తేజోవతి

image

టీడీపీ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతిని నేడు పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి టీడీపీలో చేరిన తేజోవతి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేయడంతో ఈ బాధ్యతను అప్పగించారు. తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణరావును పార్టీ అధిష్ఠానం నియమించింది.

News December 21, 2025

డ్రాగన్ ముప్పుకు ‘ద్వీప’ కవచం: అమెరికా మాస్టర్ ప్లాన్!

image

A2/AD వ్యూహంతో అమెరికా నౌకలకు చైనా సవాల్ విసురుతున్న వేళ పెంటగాన్ తన పాత EABO వ్యూహానికి పదును పెడుతోంది. భారీ నౌకలపై ఆధారపడకుండా పసిఫిక్ ద్వీపాల్లోని WW-II నాటి ఎయిర్‌ఫీల్డ్స్‌ను పునరుద్ధరిస్తోంది. తద్వారా విస్తారమైన ప్రాంతంలో క్షిపణులను మోహరిస్తూ, తైవాన్ రక్షణే లక్ష్యంగా చైనా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుంది.

News December 21, 2025

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగు

image

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.