News February 27, 2025
NRPT: రైతు అవగాహన సదస్సు.. పాల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

నారాయణపేట పట్టణ శివారులోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో ఇవాళ మ.1 గంటలకు జరిగే రైతు అవగాహన సదస్సులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చతుర్విధ జల ప్రక్రియ ద్వారా పంటల సాగు అనే అంశం పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించనున్నారు.
Similar News
News October 22, 2025
సంగారెడ్డి: పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.24 లక్షల సబ్సిడీ ఆమోదం లభించినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
ప.గో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్(D) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గొర్రె అరవింద్(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా జంగారెడ్డిగూడెం(M) దేవరపల్లికి చెందిన అరవింద్ మైలవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 22, 2025
ఖమ్మం: EVERY CHILD READS ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో EVERY CHILD READS కార్యక్రమాన్ని నెల రోజుల పాటు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1–5 తరగతి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంటసేపు కేటాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అక్షరాలు, పదాలు, పేరాలు అర్థం చేసుకునే స్థాయికి చేరేలా చేయాలన్నారు.