News March 27, 2025
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేసి రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ పాయింట్లు గుర్తించి వేగం నియంత్రణ చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు.
Similar News
News November 15, 2025
శంషాబాద్: ఉజ్బెకిస్థాన్ మహిళను డిపార్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఉజ్బెకిస్థాన్ మహిళను అధికారులు డిపార్ట్ చేశారు. వీసా గడువు లేకుండా ఉన్నట్లు గుర్తించిన మిస్ బోడానోవా జిబాష్‌ను నిన్న రాత్రి ఎఫ్‌జెడ్–436 విమానం ద్వారా దుబాయ్‌కు పంపించారు. బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది ఆమెను డిపార్చర్ గేట్ వరకు ఎస్కార్ట్ చేయగా, అనంతరం ఎయిర్‌లైన్స్ సిబ్బంది, BOI అధికారులు పర్యవేక్షణలో విమానంలోకి ఎక్కించారు.
News November 15, 2025
గుండెపోటుతో టీచర్ మృతి

అవుకులో ప్రభుత్వ ఉపాద్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. అవుకుకు చెందిన విజయ్ గత డీఎస్సీలో ఉద్యోగం సాధించి పాణ్యం గురుకుల పాఠశాలలో నెలక్రితం ఉద్యోగంలో చేరారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విజయ్ మృతితో కుటుంబంతో పాటు అవుకులో విషాదం నెలకొంది.
News November 15, 2025
HYD: ఈనెల 17న ‘మీ డబ్బు-మీ హక్కు’ జిల్లా స్థాయి శిబిరం: కలెక్టర్

‘మీ డబ్బు-మీ హక్కు’లో భాగంగా ఈనెల 17న బాగ్ లింగంపల్లిలోని TGSRTC కళ్యాణ మండపం వద్ద జిల్లా స్థాయి శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా “మీ డబ్బు- మీహక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.


