News January 28, 2025
NRPT: లిఫ్టులో ఇరుక్కున్న ఇద్దరు.. సురక్షితంగా బయటికి

కోర్టులో తమ న్యాయవాదిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు లిఫ్టులో ఇరుక్కున్న ఘటన సోమవారం NRPT కోర్టు భవన సముదాయంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం దుప్పట్ ఘాట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్,అంజయ్య ఓ పని నిమిత్తం కోర్టుకు వచ్చి లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కరెంటు పోయి సుమారు 45 ని,పాటు మధ్యలో ఆగిపోయింది. అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా వారు ఇరుక్కున్న వారిని బయటకి తీశారు.
Similar News
News September 19, 2025
ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
News September 19, 2025
దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.