News January 30, 2025

NRPT: లేగ దూడపై చిరుత దాడి

image

కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసి చంపింది. ఇదే గ్రామానికి చెందిన కాశప్ప లేగ దూడతో పాటు పశువులను బుధవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసి వెళ్ళిపోయారు. గురువారం ఉదయం వచ్చి చూడగా లేగ దూడ మృతి చెంది ఉంది. చిరుత పులి దాడి చేసి ఉంటుందని రైతులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి జాడ కనిపెట్టి బంధించాలని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.

Similar News

News November 13, 2025

జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు..!

image

జిల్లా రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ గురించి సరిగా తెలియకపోవడం, తెలిసినా అందులో ఫార్మర్ నాట్ రిజిస్టర్ అని చూపించడం, ఎవరి పేరు మీద ఎంత పత్తి ఉందో, ఎంత వరి ఉందో తెలియకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకొని వారికి వెంటనే రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.

News November 13, 2025

నేటి నుంచే అరకు-యెలహంకా ప్రత్యేక ట్రైన్లు

image

నేటీ నుంచే దువ్వాడ మీదుగా అరకు-యెలహంకా మధ్య స్పెషల్ ట్రైన్‌లు (08551/08552), (08555/08556) నడవనున్నాయి. ఈనెల 13, 17, 23, 24 తేదీల్లో అరకు నుంచి మ.12కి స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది. తిరుగుపయనం ఈనెల 14, 24, తేదీల్లో యెలహంకా నుంచి మ.1.30 గంటకి, అదేవిధంగా 18, 25 తేదీల్లో యలహంక నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

News November 13, 2025

రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

image

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.