News April 11, 2025

NRPT: లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి

image

లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మే 10న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమంపై గురువారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేసేలా చూడాలని అన్నారు. కక్షి దారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

Similar News

News November 27, 2025

రాయచోటిలో బస్సులు ఆపి వీరంగం..6 రోజుల జైలు

image

రాయచోటి టౌన్ బంగ్లా సర్కిల్‌లో శనివారం యువకుడు కళ్యాణ్ ఆర్టీసీ బస్సులను అడ్డగించి డ్రైవర్లతో దురుసుగా ప్రవర్తించాడు. ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. AJFCM కోర్టు రాయచోటిలో ఇన్‌ఛార్జ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ తేజస్విని ఎదుట హాజరుపరచగా ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.

News November 27, 2025

అమరావతిలో ‘మెగా’ ఎయిర్‌పోర్ట్.. మాస్టర్ ప్లాన్ వివరాలివే!

image

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 4,618 ఎకరాల్లో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. 4 కి.మీ పొడవైన రన్‌వేను ఫేజ్-1లో ప్లాన్ చేశారు. ఇది ‘కోడ్-4ఎఫ్’ స్థాయి విమానాశ్రయం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్‌బస్ A380, బోయింగ్ 777-9 కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చని సమాచారం.

News November 27, 2025

చిత్తూరు: మహిళా ఉద్యోగులకు తప్పని వేధింపులు.!

image

చిత్తూరులో జిల్లాలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై విలేకరుల మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. వనదుర్గాపురానికి చెందిన ఆర్మీ ఉద్యోగి నవీన్ నాయుడు, విలేకరి శరవణ, HRC సభ్యుడు గురు ప్రసాద్‌ సోషల్ మీడియా వేదికగా తనను చిత్రవధ చేస్తున్నారని ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 5 నెలలుగా వేధిస్తుండగా భర్త అనుమానంతో దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.