News April 11, 2025
NRPT: లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి

లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మే 10న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమంపై గురువారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేసేలా చూడాలని అన్నారు. కక్షి దారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Similar News
News April 24, 2025
ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.
News April 24, 2025
వరంగల్‌లో గురువారం మెగా జాబ్ మేళా

వరంగల్ జిల్లాలో గురువారం మెగా జాబ్ మెళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ కళాశాలలో గల ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు రావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 సంప్రదించాలని కోరారు.
News April 24, 2025
చేగుంట: రోడ్డు ప్రమాదంలో RMP వైద్యురాలి మృతి

చేగుంట శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యురాలు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా గాజులరామారం వాసి కమ్మరి మంజుల(45) బుధవారం కూతురు గ్రామమైన కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుంది. చేగుంట వద్ద లారీ రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలవడంతో బైక్ ఢీకొని మంజుల అక్కడికక్కడే మృతి చెందింది.