News March 9, 2025
NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 17, 2025
క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.