News March 9, 2025

NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

image

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 5, 2026

ఏలూరు: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 666 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథ్స్ బి, బయాలజీ, జువాలజీ 1 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 56 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పరీక్షల అధికారి యోహన్ తెలిపారు. పరీక్షలకు 6,985 మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ కారణాలతో 666 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.

News March 5, 2026

NGKL: బాలికపై యువకుల అత్యాచారయత్నం

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఇద్దరు యువకులు సమీపంలోని ఓ ఇంటిలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు ఉప్పునుంతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు.

News March 5, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్–దంతేవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, మ్యాగజైన్‌లు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో బలగాలు కూంబింగ్ చర్యలను ముమ్మరం చేశాయి.