News February 11, 2025

NRPT: ‘లోక్ అదాలత్ విజయవంతం చేయాలి’

image

మార్చ్ 8న నిర్వహించే లోక్ అదాలత్‌ను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం నారాయణపేట కోర్టు సమావేశ మందిరంలో పోలీస్, ఎక్సైజ్, కోర్టు సిబ్బందితో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. లోక్ అదాలత్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

Similar News

News November 8, 2025

పింఛన్ డబ్బుతో డిజిటల్ అసిస్టెంట్ పరార్

image

మెంటాడ మండలం జయతి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నెక్కల శ్రీను సుమారు రూ.70,000 ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బుతో పరారయ్యాడని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో విమలకుమారి శనివారం చెప్పారు. గ్రామంలో పింఛన్‌దారుల నుంచి వేలిముద్రలు తీసుకొని వెంటనే పింఛన్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా నగదు ఇంకా రాలేదని, వేలిముద్రలు పడలేదని సాకులు చెప్పినట్లు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని సస్పెండ్‌ చేశామన్నారు.

News November 8, 2025

‘కీర్తి’ తెచ్చిన పనులు.. కింద పడేసిన మాటలు!

image

20వ శతాబ్దపు అతిగొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన అమెరికన్ సైంటిస్ట్ జేమ్స్ వాట్సన్(97) నిన్న కన్నుమూశారు. DNAలోని ‘డబుల్ హెలిక్స్’ నిర్మాణాన్ని కనుగొన్నందుకు మరో ఇద్దరితో కలిసి 1962లో ఆయన నోబెల్ అందుకున్నారు. కానీ 2000 దశకంలో వాట్సన్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ఠను దిగజార్చాయి. జీన్స్‌ కారణంగా నల్లజాతీయుల కంటే తెల్లజాతీయుల IQ లెవెల్స్ ఎక్కువని ఆయన వాదించడం వివాదానికి కారణమైంది.

News November 8, 2025

ఉలవపాడు: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

image

ఉలవపాడు మండలంలోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెంకు చెందిన యువకుడు శనివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. SI అంకమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపట్టపుపాలెంకు చెందిన వాయిల చంద్రయ్య, ఆయన కుమారుడు రాజు ఉదయం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు తిరగబడింది. ఆ ఘటనలో రాజు చనిపోయినట్లు తెలిపారు.