News March 9, 2025
NRPT: వాహనాలు కండిషన్ లో ఉంచుకోవాలి: ఎస్పీ

పోలీస్ వాహనాలను కండిషన్ లో ఉంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ డ్రైవర్లకు సూచించారు. శనివారం నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో జిల్లాలోని పోలీస్ వాహనాలను పరిశీలించారు. వాహనాల మెయింటెనెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ప్రతి రోజు శుభ్రపరచాలి, వాహనాల్లో సమస్యలు వస్తె వెంటనే రిపేర్లు చేయించాలని అన్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో వాహనాలు దోహదపడతాయని సూచించారు. డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు.
Similar News
News April 11, 2026
WGL: క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయం

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరుపై ప్రజలు నేరుగా అభిప్రాయం తెలియజేయడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసి, వాటిని స్కాన్ చేస్తే ప్రత్యేక ఫారమ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. ఫిర్యాదులపై స్పందన, పోలీసుల ప్రవర్తన వంటి అంశాలపై మంచి-చెడు అభిప్రాయాలను గోప్యంగా తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరగనుంది.
News April 11, 2026
ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని అందులో రాసి ఉంది. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
News April 11, 2026
SVU: ఈ నెల 13 లాస్ట్.!

SVU పరిధిలో ఈనెల 25వ తేదీ నుంచి పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజమాణిక్యం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎమ్ఎస్ డేటాసైన్స్, ఎంఈడీ, ఎమ్ఎల్ఎస్సీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు.


