News October 19, 2024
NRPT : విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలి : టీపీటీఎఫ్

ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారిలు సూచించారు. నారాయణపేటలోని అంబేడ్కర్ భవన్లో విద్యారంగ సమస్యలు, సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2025
బాలానగర్లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
News November 27, 2025
MBNR: నేటి నుంచి నామినేషన్లు.. ఇవి తప్పనిసరి.!

✒సంబంధిత ప్రాంతం ఓటర్ లిస్టులో పేరు ఉండాలి
✒21 ఏళ్ల వయస్సు ఉండాలి
✒నిర్ణీత డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
✒నేర చరిత్ర, ఆస్తులు,అఫిడవిట్ పై అభ్యర్థి ఎలక్షన్ ఖర్చు,విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి
✒SC,ST,BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి
✒అఫిడవిట్ పై అభ్యర్థి+2 సంతకాలు ఉండాలి
✒ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి


