News March 13, 2025

NRPT: వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎండాకాలంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో గురువారం వాతావరణం మార్పులు వేసవికాలం ఎండ తీవ్రత వడదెబ్బ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు ప్రయాణాలలో త్రాగునీరు వెంట తీసుకెళ్లాలన్నారు. ఎండ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News April 16, 2026

ఇంటి నుంచి వివరాలు నమోదు చేసుకోండి: JC

image

దేశంలో తొలిసారిగా డిజిటల్ జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు
NTR JC ఎస్.ఇలక్కియ తెలిపారు. ప్రజలు https://se.census.gov.in⁠� పోర్టల్ ద్వారా తమ ఇంటి నుంచే వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొని జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.

News April 16, 2026

వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

image

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.

News April 16, 2026

వనపర్తి: 3,897 మంది రైతులకు రూ.30.02 కోట్ల రుణమాఫీ

image

గోపాల్ పేట మండలంలో 3,897 మంది రైతులకు గాను మొత్తం రూ.30.02 కోట్ల రుణమాఫీ చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. అదేవిధంగా 12,637 మంది రైతులకు గాను 23,275 ఎకరాలకు రూ.13.96 కోట్ల పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను అందించామన్నారు. మండలంలో మొత్తం 10,534 రేషన్ కార్డులు ఉండగా.. వాటిలో కొత్తగా 962 రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.