News April 2, 2025
NRPT: సన్న బియ్యంతో అన్నం పెడితే తినడానికి వస్తా: ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణంలోని అశోక్ నగర్ రేషన్ షాపు 37లో సన్న బియ్యం పంపిణీని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ సన్న బియ్యంతో అన్నం వండి పెడితే తినడానికి వస్తానని మహిళలతో అనడంతో తమ ఇంటికి రావాలని తప్పకుండా పెడతామని మహిళలు ఎమ్మెల్యేకు చెప్పారు.
Similar News
News December 8, 2025
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్‌తో 12 వరకు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
News December 8, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

2026 మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు చెల్లించే ఫీజు తేదీల గడువును పెంచినట్లు సత్యసాయి జిల్లా DEO క్రిష్టప్ప ఆదివారం తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యం గమనించాలని కోరారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125లు, ఒకేషనల్ విద్యార్థులు ఫీజుతో పాటు అదనంగా రూ.60లు, తక్కువ వయస్సు కోసం రూ.300లు చెల్లించాన్నారు.
News December 8, 2025
నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: కర్నూలు SP

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.


