News April 8, 2025

NRPT: సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే & కలెక్టర్.

image

ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్‌కార్డు లబ్ధిదారులందరు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా నర్వ మండల లంకాల గ్రామ చౌక ధర దుకాణంలో వారు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులందరికి సన్న బియ్యం పంపిణీ వారు ఆదేశించారు.

Similar News

News November 24, 2025

రేపు కామారెడ్డి జిల్లాకి టీజీఎంబీసీడీసీ అధికారుల రాక

image

రేపు జిల్లాకి తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMBCDC) రాష్ట్ర అధికారులు రాబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం అయన మాట్లాడుతూ.. జిల్లాలోని MBC కులాల సామాజిక ఆర్థిక స్థితి మీద వారు సర్వే నిర్వహిస్తారన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అధ్యక్షతన రేపు కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 226లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News November 24, 2025

కామారెడ్డి: కానిస్టేబుల్ కుటుంబాలకు చెక్కులు అందజేత

image

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ రవికుమార్, బుచ్చయ్య కుటుంబాలకు పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి విలువ గల చెక్కులను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఎస్బీఐ రీజినల్ మేనేజర్ బృందంతో కలిసి సోమవారం అందజేశారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

News November 24, 2025

సిద్దిపేట: ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.