News January 24, 2025
NRPT: సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,473

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 2,473, కనిష్ఠంగా రూ. 1,940 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. తెల్ల కందులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 8,259, గరిష్ఠంగా రూ. 7,191, ఎర్ర కందులు గరిష్ఠంగా రూ. 7,811, కనిష్ఠంగా రూ. 5,600, వేరు శనగ గరిష్ఠంగా రూ. 5,940, కనిష్ఠంగా రూ. 3,089 ధర పలికిందని చెప్పారు.
Similar News
News December 12, 2025
పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.
News December 12, 2025
కాజీపేటలో 103 చలాన్లు ఉన్న బైక్ సీజ్

కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 103 పెండింగ్ చలాన్లు ఉన్న ఒక బైక్ను గుర్తించారు. ఆ వాహనంపై మొత్తం ₹25,105 బకాయిలు ఉండటంతో, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఆదేశాల మేరకు ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు కనక చంద్రం, సంపత్ పాల్గొన్నారు.
News December 12, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.


