News January 24, 2025
NRPT: సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,473

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 2,473, కనిష్ఠంగా రూ. 1,940 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. తెల్ల కందులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 8,259, గరిష్ఠంగా రూ. 7,191, ఎర్ర కందులు గరిష్ఠంగా రూ. 7,811, కనిష్ఠంగా రూ. 5,600, వేరు శనగ గరిష్ఠంగా రూ. 5,940, కనిష్ఠంగా రూ. 3,089 ధర పలికిందని చెప్పారు.
Similar News
News February 18, 2025
శుభ ముహూర్తం (మంగళవారం, 18-02-2025)

తిథి: బహుళ షష్ఠి తె.4.34 వరకు
నక్షత్రం: స్వాతి
రాహుకాలం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, తిరిగి రా.10.48- రా.11.36
వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.32 వరకు
అమృత ఘడియలు: రా.9.51 నుంచి రా.11.33 వరకు
News February 18, 2025
సిరిసిల్ల: అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోండి: ఎస్పీ

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపై సున్నితంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.
News February 18, 2025
CMను ఆహ్వానించింన MLA బొజ్జల

తిరుపతి పర్యటకు వచ్చిన CM చంద్రబాబుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని CMను ఆహ్వానించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్ అధికారులు పాల్గొన్నారు.