News February 2, 2025
NRPT: సబ్సిడీపై మామిడి రైతులకు ఫ్రూట్స్ కవర్లు

మామిడి తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై ఫ్రూట్స్ కవర్లు అందిస్తామని నారాయణపేట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. చెట్టుపై మామిడి కాయలను కవర్లు కడితే అధిక దిగుబడి, కాయ మొత్తానికి ఒకే రంగు, ఎలాంటి మచ్చలు ఉండవని చెప్పారు. కాయలకు అధిక ధర వస్తుందని అన్నారు. ఎకరాకు 8 వెల కవర్లను 50 శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. కవర్లు కావాల్సిన రైతులు 8977714457 నంబర్‌కు సంప్రదించాలని అన్నారు.
Similar News
News February 16, 2025
ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా?

ప్రస్తుతం ఆన్‌లైన్, పార్సిల్‌లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్‌ను నాశనం చేసి డీహైడ్రేటింగ్‌కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో ఫుడ్ తినడం బెటర్.
News February 16, 2025
ఘజన్‌ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీబ్

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్‌ఫర్ స్థానంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు ఘజన్‌ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.
News February 16, 2025
రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.