News March 18, 2025

NRPT: సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే

image

నారాయణపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. కోయిలకొండలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు, దన్వాడ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలకు నూతన భవనం మంజూరు చేయాలని కోరారు. మరికల్‌కు జూనియర్ కలశాల శాంక్షన్ చేయాలని చెప్పారు. నారాయణపేట పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలకు, అభ్యసన ఉన్నత పాఠశాలకు నూతన భవనాలు మంజూరు చేయాలని అన్నారు.

Similar News

News September 19, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News September 19, 2025

బగ్రామ్ ఎయిర్‌బేస్‌ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

image

అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్‌బేస్‌కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 19, 2025

కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.