News November 2, 2024

NRPT: సర్వే చేసేందుకు ఉపాధ్యాయుల జాబితా సిద్ధం చేయాలి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు ఉపాధ్యాయుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా ప్రణాళిక, విద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సర్వే నిర్వహించేందుకు మొత్తం 1180 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు అవసరమని వారి పాత్ర కీలకమని అన్నారు.

Similar News

News December 6, 2024

MBNR: నియామక పత్రాలు అందజేయండి !

image

TGPSC ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో JL గా ఎంపికైన అభ్యర్థులు తమకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొందలకుంట గ్రామానికి చెందిన జయరాములు, మొల్గర గ్రామానికి చెందిన మహేశ్, చందాపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులుగా ఎంపికయ్యారు. నియామక పత్రాలు వెంటనే అందజేసి ఇంటర్ విద్యలో తమను భాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News December 6, 2024

వనపర్తి: నేడు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కళా ప్రదర్శనలు: కలెక్టర్

image

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మెగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కళాకారుడు డప్పుల నాగరాజు సారథ్యంలో వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News December 5, 2024

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం: సీఎం రేవంత్

image

సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా సహచర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లతో పేదల కలను సాకారం చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.