News November 28, 2024

NRPT: ‘సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’

image

సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. కుల, మత, ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఇతరుల మనోభావాలు కించపరిచేలా వాట్స్ అప్, ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాపై ఐటి పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు.

Similar News

News December 13, 2025

MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.

News December 13, 2025

సిరి వెంకటాపూర్‌లో అత్యంత ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి, దోనూరు, కోయిలకొండ మండలం పారుపల్లి 10.6, మిడ్జిల్ 10.9, మహబూబ్‌నగర్ గ్రామీణం 11.0, దేవరకద్ర, రాజాపూర్ 11.1, మహమ్మదాబాద్, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 11.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.

News December 12, 2025

రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

image

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.