News February 22, 2025

NRPT: సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ డీకే అరుణ

image

నారాయణపేట ‘ప్రజా పాలన-ప్రగతి బాట’బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మోదీ పాలనకు.. రేవంత్ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రజలు చూసి మూడోసారి బీజేపీకి అధికారం అందించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.

Similar News

News December 13, 2025

KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

శంకరపట్నం మండలంలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) గౌస్‌ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్‌ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

News December 13, 2025

‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

image

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.

News December 13, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 311 మంది గైర్హాజరు

image

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 4,501 మంది అభ్యర్థులకు గానూ 4,190 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ ఒక పరీక్ష కేంద్రాన్ని.. ఫ్లైయింగ్ స్క్వాడ్ 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.