News February 2, 2025
NRPT: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
అధునాతన టెక్నాలజీని వాడుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని, ఫోన్లకు వచ్చే అనవసర లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ కాల్స్‌పై స్పందించొద్దని చెప్పారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 3, 2025
NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం
సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News February 3, 2025
IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.
News February 3, 2025
కల్వకుర్తి: కీలక కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు
కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.