News February 2, 2025
NRPT: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

అధునాతన టెక్నాలజీని వాడుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని, ఫోన్లకు వచ్చే అనవసర లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ కాల్స్‌పై స్పందించొద్దని చెప్పారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 14, 2025
మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్‌ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
News February 14, 2025
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(ఎన్.యూ.జే.ఐ) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి రాజు, గట్టు రవీందర్, అరిగేలా జనార్దన్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.
News February 14, 2025
అర్జీల పరిష్కారానికి జవాబుదారిగా పనిచేయాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో బద్వేల్, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.