News April 9, 2025
NRPT: ‘స్కీములతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీములపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ప్రకటనలో హెచ్చరించారు. గొలుసుకట్టు స్కీముల పేరుతో మోసగాళ్ళు చెప్పే మాటలు, వాగ్దానాలు, ప్రకటనలు నమ్మకూడదని అన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్ళు కొత్త పంథా ఎంచుకున్నారని, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని ప్రజలకు ఆశలు కల్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
Similar News
News November 21, 2025
జాబ్ చేస్తున్నారా..? ఈ షిఫ్టు మహా డేంజర్!

ప్రస్తుతం కంపెనీని బట్టి డే, నైట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యంపై షిఫ్ట్ డ్యూటీల ప్రభావాన్ని పరిశీలిస్తే.. డే షిఫ్టులు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. అదే రొటేషనల్ షిఫ్టులు ప్రమాదకరమని, షెడ్యూల్ తరచూ మారితే శరీరం సర్దుబాటు చేసుకోలేదని హెచ్చరించారు. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.
News November 21, 2025
వరంగల్ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

హనుమకొండలోని ములుగు రోడ్లో గల నూతనంగా నిర్మించే వరంగల్ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనులను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. డిస్ట్రిక్ట్ స్టోర్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులన్నీ రాబోయే గణతంత్ర దినోత్సవానికి పూర్తి కావాలని, పచ్చదనం, మొక్కలు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
News November 21, 2025
విద్యార్థుల సృజనాత్మకతకు అటల్ ల్యాబ్లు కీలకం: డీఈవో

అమలాపురం మండలం పేరూరు జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మూడు రోజుల అటల్ ల్యాబ్ ఉపాధ్యాయుల వర్క్షాప్ శుక్రవారంతో ముగిసింది. డీఈవో సలీం బాషా, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని కొత్త ఆలోచనలకు ఈ ల్యాబ్లు వేదికగా మారాలని ఆకాంక్షించారు. ల్యాబ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఈవో ఉపాధ్యాయులను హెచ్చరించారు.


