News March 1, 2025
NRPT: స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీత పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట మండల పరిధిలోని లింగంపల్లి శివారు సర్వే నంబర్ 30లో ఉన్న 20 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన పాఠశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ.200 కోట్లతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News October 15, 2025
రాజన్న అభివృద్ధి పనులు ఆపుతారా? కొనసాగిస్తారా?

సమ్మక్క సారక్క జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుంది. ఈ సమయంలో అభివృద్ధి పనులు కొనసాగితే భక్తులకు తీవ్ర అకసౌకర్యం ఏర్పడుతుంది. అటు అభివృద్ధి పనులు, ఇటు దర్శనాలు ఒకే సమయంలో జరిగితే లక్షల్లో భక్తులను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
News October 15, 2025
విజయవాడ: గేదెలపై పడ్డ దొంగల కళ్లు!

ఎన్టీఆర్ జిల్లాలో ఓ దొంగల ముఠా కళ్లు గేదెలపై పడ్డాయి. పాలు, వాటి అనుబంధ పదార్థాల ధరలు పెరగడంతో గేదెల విలువ బాగా పెరిగింది. రూ.లక్ష వరకు ధర ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓ ముఠా గేదెలు ఎత్తుకుపోతోంది. బొలేరో, టాటా ఏస్ వంటి వాహనాల్లో వచ్చి గేదెలను అందులోకి ఎక్కించి దొంగిలించుకుపోతున్నారు. ఈ క్రమంలో విజయవాడ CCS పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఠా మొత్తాన్ని పట్టుకునే పనిలో పడ్డారు.
News October 15, 2025
ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. ఖమ్మం నుంచే షురూ..!

ప్రభుత్వం పచ్చదనంతో పాటు ఆదాయం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో ప్రభుత్వ స్థలాలు, రహదారులు, బీడు భూముల్లో ఆయిల్పామ్ మొక్కలు పెంచి పచ్చదనంతో పాటు ఆదాయం పొందేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంను మోడల్గా తీసుకుని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ స్థలాల్లో మొక్కలను నాటడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదాయం లభించనుంది.