News February 12, 2025

NRPT: స్థానిక ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నారాయణపేట పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధన పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.

Similar News

News December 13, 2025

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

image

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

మంత్రి సంధ్యారాణిని కలిసిన మన్యం డీఈవో

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో‌గా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు శనివారం మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ మంత్రిని కలిశారు.