News February 12, 2025
NRPT: స్థానిక ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నారాయణపేట పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధన పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.
Similar News
News March 24, 2025
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం: సీఎం

AP: అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం(D)లో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ పరంగా వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
News March 23, 2025
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
News March 23, 2025
కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.