News March 15, 2025
NRPT: ‘హక్కుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలి’

వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తువుల వినియోగం తప్పనిసరి అని అన్నారు. వాటిని కొనుగోలు చేసిన సందర్భంలో నకిలీ వస్తువులుగా గుర్తిస్తే విక్రయించిన వారిపై ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 22, 2025
నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే రీఎంట్రీ: రంభ

తన పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యానని అలనాటి హీరోయిన్ రంభ వెల్లడించారు. ఇప్పుడు కుమార్తెలకు 14, 10 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన తన రక్తంలోనే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
News April 22, 2025
నారాయణపేటకు నూతన వైద్యాధికారి

నారాయణపేట జిల్లా నూతన వైద్య శాఖ అధికారిగా డాక్టర్ జయ చంద్రమోహన్‌ను నియమిస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ DMHOగా పని చేసిన సౌభాగ్యలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధికారులు విచారణ చేసి కార్యదర్శికి నివేదికలు అందించారు. దీంతో ఆమెను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News April 22, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో యాక్సిడెంట్

తిర్యాణి మండలం గిన్నెదరిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిను యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.