News April 5, 2025
NRPT: ‘హరితహారం చెట్లకు హాని జరగకుండా చదును చేసుకోండి’

నారాయణపేట జిల్లాలో రైతులు తమ పొలాలను చదును చేసే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న హరిత హారం మొక్కలు నిప్పుకు ఆహుతి అవుతున్నాయి. జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామ పరిధిలోని చిన్నజట్రం టూ బోయిన్‌పల్లి రోడ్డులో హరితహారం చెట్లకు కొందరు నిప్పు పెట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని, రైతులు హరితహారం చెట్లకు హాని జరగకుండా చదును చేసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News April 13, 2025
SKLM: ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.2,67,800/- లు,పూజలు, విరాళాల రూపంలో రూ.78,417/-లు, ప్రసాదాల రూపంలో రూ.1,76,405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.
News April 13, 2025
దర్శి: మహిళ దారుణ హత్య

దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2025
అమెరికాలో మాదిరి రోడ్లు నిర్మిస్తాం: నితిన్ గడ్కరీ

వచ్చే రెండేళ్లలో రోడ్ల నిర్మాణాల కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారతంలోని రహదారులను USAరోడ్ల మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్లలో భారత్‌ని ప్రపంచంలోని అత్యున్నత మౌలిక సదుపాయాలు కలిగిన దేశంగా అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 2014లో 91,287కి.మీ ఉన్న జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 1,46,204 కి.మీకి పెరిగిందన్నారు.