News December 26, 2025
NRPT: అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బదిలీ

నారాయణపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా విధులు నిర్వహించిన సంచిత్ గంగ్వార్‌ను GHMC మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న నారాయణ్ అమిత్ మాలెంపాటిని నారాయణపేటకు బదిలీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ సెలవులో ఉండటంతో సంచిత్ గంగ్వార్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించారు.
Similar News
News December 27, 2025
ఉగాది లోపు పెండింగ్ ఇళ్లు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆప్షన్–3 కింద నిర్మాణంలో ఉన్న 10,034 ఇళ్లలో పెండింగ్‌లో ఉన్న 6వేల ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో హౌసింగ్ పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 4,794 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 2,522 ఇళ్లలో లోపాలు గుర్తించామని తెలిపారు. వాటిలో 868 ఇళ్ల లోపాలు సరిచేశామని, మిగిలినవన్నీ వారంలోపు పూర్తి చేయాలన్నారు.
News December 27, 2025
మానవత్వం చాటుకున్న ADB కలెక్టర్

ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇచ్చోడ మండలం ముక్రా (బి) గ్రామానికి చెందిన మోహితె శివాంగి (10 సంవత్సరాలు) అనే చిన్నారి థలసేమియా వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ చిన్నారి చికిత్స నిమిత్తం తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News December 27, 2025
కుప్పం: మహిళతో వివాహేతర సంబంధం.. యువకుడి సూసైడ్

కుప్పం (M) నూలుకుంట గ్రామంలో నాగరాజు కుమారుడు కాళీ (35) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇటీవల కాళీ గొడవపడి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాళీ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


