News January 30, 2025

NRPT: ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు: పోలీసులు 

image

మహిళలను ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. బుధవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ పై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News July 7, 2025

ఉమ్మడి నల్గొండలో డీసీసీ పదవులకు తీవ్ర పోటీ.!

image

ఉమ్మడి NLG జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా జిల్లాలో DCC అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో DCC కీలకం కానుండటంతో పదవుల కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నేతలు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎంపికలు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

News July 7, 2025

MNCL: 45 లక్షల మొక్కలు నాటేందుకు సింగరేణి సిద్ధం

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఅండ్ఎండీ బలరాం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో కనీసం మూడు మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 14 వేల హెక్టార్లలో ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటిందని పేర్కొన్నారు.

News July 7, 2025

VJA: త్వరలో రైతులకు యాన్యుటీ నగదు

image

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అందించే వార్షిక యాన్యుటీ (కౌలు) చెల్లించేందుకు విజయవాడలోని CRDA అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. జరీబు, మెట్ట భూమి ఇచ్చిన వారికి ఇచ్చే కౌలును ప్రభుత్వం మరో 5ఏళ్లు పొడిగించిన నేపథ్యంలో రైతుల ఖాతాలలో నగదు జమ చేసేందుకు అర్హుల జాబితాలు రూపొందించే ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు 10ఏళ్ల పాటు రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు అందజేసింది.