News February 16, 2025
NRPT: ఆర్డర్ కాపీలు అందుకున్న (2008) DSC అభ్యర్థులు

DSC 2008లో నష్టపోయిన అభ్యర్థులు ఎట్టకేలకు శనివారం రాత్రి అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీలను అందుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ZPCEO సౌభాగ్య లక్ష్మి, DEO గోవిందరాజులు సమక్షంలో ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టలో డీఈఓ గోవిందరాజు చేతుల మీదుగా ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి 45 మంది 2008 DSC అభ్యర్థులు ఆర్డర్ కాపీలను అందుకున్నారు.
Similar News
News November 13, 2025
వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు: KTR

తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతిని కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారని, వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని కేటీఆర్ ‘X’లో పేర్కొన్నారు.
News November 13, 2025
క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.
News November 13, 2025
JGTL: తేమ పేరుతో ఇబ్బందులు పెడితే చర్యలు: మంత్రి

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. టార్పాలిన్‌లు, తూకం, శుద్ధి యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు. క్లస్టర్ అధికారులు కేంద్రాలను ప్రతిరోజూ పరిశీలించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకొని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులకు తేమ శాతం పేరుతో ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.


