News February 25, 2025

NRPT: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే వారోత్సవాలను సందర్భంగా బ్యాంక్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ‘ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట’ వివిధ రకాల సురక్షితమైన పొదుపు వర్గాలను ఎంచుకొని భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలన్నారు.

Similar News

News February 21, 2026

VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

image

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

పాలిటెక్నిక్‌తో ఉజ్వల భవిష్యత్తు: ప్రిన్సిపల్‌

image

పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడం ద్వారా విద్యార్థులు త్వరగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ మల్లికార్జున్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో ‘పాలిసెట్-2026’పై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 24వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 21, 2026

బాధితులకు త్వరితగతిన న్యాయం: ఏఎస్పీ

image

ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందితో ఏఎస్పీ సూర్యచంద్రరావు శనివారం సమీక్ష నిర్వహించారు. మానిటరింగ్ సెల్ ఏర్పాటు తర్వాత 47 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అందులో 25 మందికి జీవిత ఖైదు ఖరారైందని ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సీఐ సుబ్బారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.