News March 13, 2025
NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 86 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి దర్శనం వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 3,527 మందికి, 3460 మంది హాజరుకాగా, 67 మంది గై హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 547 మందికి 528 మంది పరీక్షలకు హాజరయ్యారు. 19 మంది గై హాజరైనట్లు తెలిపారు. వివిధ మండలాలను ప్లేయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
Similar News
News February 22, 2026
పరీక్షల వేళ విద్యార్థులు ఇలా చేస్తే మంచిది!

APలో రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ టైమ్‌లో విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇవాళ రాత్రి తగినంత నిద్రపోయి, రేపు ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకొని పరీక్షా కేంద్రానికి ముందుగానే బయల్దేరాలి. హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన వస్తువులను పడుకొనే ముందే రెడీ చేసుకోవాలి. పరీక్షలో ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే ఆందోళన చెందకుండా మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలి. share it.
News February 22, 2026
రేపటి నుంచి ఐపీఓల హవా

దేశీయ స్టాక్ మార్కెట్లలో రేపటి నుంచి వారం పాటు ఐపీఓల హవా కొనసాగనుంది. తొమ్మిది ఐపీఓలు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటితో ₹4,405 కోట్ల పెట్టుబడి రానుందని అంచనా. రేపు ఒక్కరోజే ఐదు ఐపీఓలు ఓపెన్ అవుతాయి. వీటిలో ₹3,100 కోట్లతో క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ బిగ్గెస్ట్ ఐపీఓగా ఉంది. మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్‌లో నాలుగు, SME సెగ్మెంట్‌లో ఐదు ఐపీఓలు లాంచ్ అవుతున్నాయి.
News February 22, 2026
రాజన్న ఖజానాకు కాసుల పంట.. 2 నెలల్లో రూ. 11.60 కోట్లు

వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు రెండు నెలల వ్యవధిలో రూ.11.60 కోట్ల ఆదాయం సమకూరింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో సుమారు నెలరోజులకు పైగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరాగా.. కోడె మొక్కులు, అభిషేకం అన్న పూజ టికెట్లు, హుండీ తదితరాల ద్వారా రూ.10.17 కోట్ల ఆదాయం సమకూరింది. మహాశివరాత్రి జాతర సందర్భంగా మరో రూ.1.43 కోట్లు ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా మరో రూ.2 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది.


