News March 8, 2025
NRPT: ఇంటర్ పరీక్షకు 4553 మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 4553 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం విద్యార్థులు 4702 కాగా, వారిలో 149 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని చెప్పారు. మరికల్, మక్తల్ గురుకుల జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారని చెప్పారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.
Similar News
News September 14, 2025
కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులకు కొత్త ప్రతిపాదనలు

వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంతో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సూచించిన కొత్త రైల్వే ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌తో DPR రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు.
News September 14, 2025
NTR: విషజ్వరాలు.. ప్రజల్లో ఆందోళన.!

NTR జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది విజయవాడలో ఆసుపత్రిలో చేరగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వారిని పరామర్శించారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News September 14, 2025
‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.