News April 4, 2025

NRPT: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

image

నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో గత ఫిబ్రవరి 21న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు దేవమ్మ అనే మహిళ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాగా శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆ ఇంటి నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలోని షమీ బేగం, ఆశా బేగం ఇళ్లను పరిశీలించారు.

Similar News

News April 11, 2025

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఈసీ 

image

ఏపీలో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. రానున్న సంవత్సరంలో ఏపీలో జరిగే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీసు బలగాలను సిద్ధం చేయడం, ఎలక్ట్రోరల్ రోల్ అంశాలపై దృష్టి సారించాలన్నారు.

News April 11, 2025

17లోగా పేర్లు నమోదు చేసుకోవాలి: డీఈవో భిక్షపతి

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 19న నిర్వహించే ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంలో భాగంగా నిర్వహించే ఆర్యభట్ట స్వర్ణజయంతి ఉత్సవాల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్లో ఈ నెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 11, 2025

ములుగు, భూపాలపల్లి, MHBD జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. నేడు వర్షాలు కురిసే అవకాశముందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!