News February 21, 2025
NRPT: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడంతో పాటు రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News December 15, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 15, 2025
WGL: కాంగ్రెస్ 545, BRS 336, BJPకి 29 జీపీలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. మొదటి, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 545 పంచాయతీలకు గెలువగా, బీఆర్ఎస్ 336, బీజేపీ 29, ఇతరులు 98 పంచాయతీలను గెలుచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి బీజేపీ 29 జీపీలను గెలిచి తన ఖాతాను తెరవగా, మిగిలిన 3వ దశపై మూడు పార్టీలు గురి పెట్టాయి. బీఆర్ఎస్ రెండో విడతలో కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది.
News December 15, 2025
అంచనాలను అందుకోని రబీ సాగు

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.


