News March 31, 2025
NRPT: ఈద్గా, మజీద్‌ల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు

రంజాన్ పండగను పురస్కరించుకొని సోమవారం జిల్లాలోని ఈద్గా, మజీదుల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డైవర్షన్ చేస్తామని అన్నారు. జిల్లా కేంద్రంలోని చౌరస్తాల్లో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పండగను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 1, 2026
కృష్ణా జిల్లాలో మహిళలపై నేరాలకు బ్రేక్

కృష్ణా జిల్లాలో మహిళల భద్రత దిశగా సానుకూల మార్పు కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. పోక్సో కేసులు 133 నుంచి 77కి తగ్గి 42 శాతం తగ్గుదల నమోదు కాగా, మహిళలపై మొత్తం నేరాలు 914 నుంచి 669కి చేరి 27 శాతం తగ్గాయి. పోలీసుల కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
News January 1, 2026
మార్కాపురానికి CM రాక?

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News January 1, 2026
రాష్ట్రస్థాయి హాకీలో రామేశ్వరం కీర్తి.. DSP చేతుల మీదుగా పురస్కారం!

పులివెందులలో జరిగిన సౌత్ జోన్ హాకీ పోటీల్లో సత్తా చూపిన ఘనత పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాపర్తి కృష్ణ కుమార్తె సత్య శ్రీలక్ష్మికే దక్కింది. సౌత్ జోన్ హాకీ లీగ్-2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున సత్య శ్రీలక్ష్మి పాల్గొన్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ ధరన్ చేతుల మీదుగా సత్య శ్రీలక్ష్మీ పురస్కారం అందుకున్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సత్యశ్రీకి అభినందనలు తెలిపారు.


