News December 16, 2025
NRPT: ఈనెల 18న T-20 లీగ్ క్రికెట్ జట్టు ఎంపికలు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 18న MDCA, జీ వెంకటస్వామి కాక మెమోరియల్, HCA ఆధ్వర్యంలో T-20 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్‌ఛార్జ్ రమణ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 ఫొటోలతో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 91007 53683 చరవాణికు సంప్రదించాలన్నారు.
అవసరమైన వారికి SHARE IT.
Similar News
News December 17, 2025
రంగారెడ్డి: పోలింగ్ ఫైనల్ UPDATE

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 7 మండలాల్లో 81.54 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
1.అబ్దుల్లాపూర్‌మెట్-77.42
2.ఇబ్రహీంపట్నం-85.41
3.కందుకూరు-86.73
4.మాడ్గుల్-74
5.మహేశ్వరం-80.01
6.మంచాల్-83.34
7.యాచారం-83
News December 17, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో 77.82 శాతం ఓటింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా సాగింది. ప్రాథమిక సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా 77.82 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గడువు ముగిసినప్పటికీ పలు కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఉండటంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు అందాక పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
వికారాబాద్ జిల్లాలో 78.79 శాతం పోలింగ్

VKB జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్‌లో 78.79 శాతం పోలింగ్ నమోదయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని పూడూర్, పరిగి దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి అభ్యర్థుల గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.


