News December 20, 2025

NRPT: ఈ నెల 23న “మీ డబ్బు , మీ హక్కు” పై సదస్సు

image

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా “మీ డబ్బు మీ హక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తులు (సొమ్ము) సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 23న కలెక్టర్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు ఉంటుందని చెప్పారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 27, 2025

పెద్దపల్లి: ‘జీవో 252ను రద్దు చేయాలి’

image

జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్‌ 143) ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో కోత విధిస్తే సహించేది లేదని, ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

News December 27, 2025

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మళ్లీ మార్పులు.!

image

ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అభ్యంతరాలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పొదిలిని ప్రకాశం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో కలిపే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

News December 27, 2025

మూడు నెలల్లో 218 మంది నిందితులపై కేసు: ఎస్పీ

image

గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గత మూడు నెలల (అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025) కాలంలోనే 218 మంది నిందితులపై 38 కేసులు నమోదు చేసి, 164 మందిని అరెస్ట్ చేసి, సుమారు 65 కేజీల గంజాయిని మరియు 150 గ్రాముల ద్రవ గంజాయిని, 28 గ్రాముల MDMA, 05 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.