News February 13, 2025

NRPT: ఎంపికైన కొబ్బరి పూల కుండీల ప్రాజెక్టు

image

పర్యావరణ అనుకూలతకు తోటకు ఉపయోగించే సామాగ్రి, బయో డీగ్రేడబుల్ కొబ్బరి పూల కుండీలను TSWRS బాలుర దామరగిద్ద పాఠశాలకు చెందిన విద్యార్థి శివారెడ్డి తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపికైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 11వ జాతీయ స్థాయి ప్రదర్శన INSPIR-MANAK పోటీల్లో పాల్గొని ఘనత సాధించినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రం నుంచి 4 ఎంపికైవ వాటిలో ఇది ఒకటి అన్నారు.

Similar News

News February 13, 2025

వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

News February 13, 2025

ఉత్త‌రాంధ్ర టీచర్ MLC బ‌రిలో 10 మంది

image

ఉత్త‌రాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియ‌మించుకోవాలని సూచించారు. 

News February 13, 2025

ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులు

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులను గురువారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు. అనంతపురంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన పోటీలలో గుంటూరుకు చెందిన ఏడుగురు పోలీసులు మొత్తం 21 పతకాలు సాధించారు వాటిలో 8 బంగారు పతకాలు ఉన్నాయి. ఆయా పోలీసులకు గురువారం ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

error: Content is protected !!