News April 1, 2025

NRPT: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసేలా చూడాలి’

image

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. పథకంపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని అన్నారు.

Similar News

News April 2, 2025

అల్లు అర్జున్ పేరులో మార్పు?

image

‘పుష్ప-2’ సినిమాతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన వివాదాస్పద ఘటనలతో పాటు కెరీర్‌లో మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్‌లో అదనంగా U, Nలు జోడించాలని యోచిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News April 2, 2025

మావోయిస్టుల సంచలన ప్రకటన

image

కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యాకాండను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు. ఇటీవల కేంద్రం చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

News April 2, 2025

తుంగతుర్తి మండల వాసికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

తుంగతుర్తి(M) కరివిరాలకొత్తగూడెంకి చెందిన కాసర్ల మహేశ్‌కి కోర్టు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ చైతన్యపురి PS పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన, అత్యాచారం, పోక్సో కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం అతడిని దోషిగా నిర్ధారించారు. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, డి.రఘు తెలిపారు.

error: Content is protected !!