News November 26, 2025

NRPT: ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: ఈసీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.

Similar News

News November 28, 2025

అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం

image

AP: రాజధాని అమరావతి పరిధిలో రెండోదశ భూసమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల (వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి) పరిధిలోని 16,666.5 ఎకరాలను సమీకరించాలని CRDAకు అనుమతి ఇచ్చింది. దీంతో ల్యాండ్ పూలింగ్‌కు CRDA నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాగా తొలివిడతలో ప్రభుత్వం 29 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించిన విషయం తెలిసిందే.

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.