News December 19, 2025

NRPT: ఎన్నికలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలు, మీడియాకు ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం ప్రకటనలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారని చెప్పారు. అందరి సహకారంతోనే సాధ్యమైందని అన్నారు.

Similar News

News December 19, 2025

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్లకు గిరాకీ

image

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్ల బిజినెస్ కళకళలాడుతోంది. వీటివల్ల కొత్త కస్టమర్లను చేరుకోగలుగుతున్నామని 59% ఓనర్లు పేర్కొన్నట్లు NCAER FY23-24 నివేదిక వెల్లడించింది. ‘హోటళ్లకు మొత్తంగా 50.4% కస్టమర్లు పెరిగారు. 52.7% కొత్త మెనూ ఐటమ్స్ యాడ్ అయ్యాయి. ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా హోటళ్లకు వచ్చే షేర్ 29%కి చేరింది. ఎంప్లాయిమెంటు 1.08 మిలియన్ల నుంచి 1.37 మిలియన్లకు పెరిగింది’ అని వివరించింది.

News December 19, 2025

విరాళాల సేకరణలో తూ.గో జిల్లాకు 3వ స్థానం

image

సాయుధ దళాల జెండా దినోత్సవం(2024-25) సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జెండా విక్రయాలు, హుండీలు, విరాళాల ద్వారా మొత్తం రూ.12,73,105 నిధులు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ సేకరణతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మూడవ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. సైనికుల సంక్షేమం కోసం విరాళాలు అందించిన దాతలను ఆమె అభినందించారు.

News December 19, 2025

తూర్పుగోదావరి పోలీసులకు ‘ABCD’ అవార్డు

image

ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ‘అవార్డ్ ఫర్ బెస్ట్ఇన్ క్రైమ్ డిటెక్షన్(ABCD)’పురస్కారాన్ని జిల్లా పోలీసు విభాగం దక్కించుకుంది. కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈగౌరవం దక్కింది. ముఖ్యంగా కొవ్వూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్లిష్టమైన హత్యకేసును చాకచక్యంగా ఛేదించిన తీరును ప్రభుత్వం గుర్తించింది. మంగళగిరిలో శుక్రవారం DGP చేతులమీదుగా SP నరసింహకిషోర్ అవార్డును అందుకున్నారు.