News October 9, 2025
NRPT: ఎన్నికల్లో ఖర్చు చేయాల్సింది ఇంతే

ఎన్నికల్లో అభ్యర్థులు వ్యయాల వివరాలను బుధవారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు. ZPTC అభ్యర్థి రూ.4 లక్షలు, MPTC రూ.1.50 లక్షలు, 50 వేలకు పైబడి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 50 తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచి కౌంటింగ్ రోజు వరకు ఖర్చు పరిగణలోకి వస్తుందన్నారు.
Similar News
News October 9, 2025
ఇకనైనా ANU ప్రతిష్ట మెరుగుపడుతుందా?

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో సైతం పలు కథనాలు పరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.
News October 9, 2025
స్థానిక సమరం.. ఉమ్మడి పాలమూరు రెడీ

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, గురువారం ఎంపీటీసీ/జడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 39 జడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లెల్లో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది.
News October 9, 2025
BELలో 30 ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)30 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు OCT 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, PWDలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/