News January 22, 2026
NRPT: ఎన్నికల వేళ మహిళా సంఘాలకు వడ్డీ డబ్బుల విడుదల

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఊరట కల్పించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద పట్టణ మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నారాయణపేటలో 427 సంఘాలకు రూ.1.40 కోట్లు, మక్తల్‌లో 123 సంఘాలకు రూ.43.70 లక్షలు, కోస్గిలో 187 సంఘాలకు రూ.65.76 లక్షలు విడుదలయ్యాయి. నిధులు విడుదల కావడంతో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.
Similar News
News February 21, 2026
RR: సోమవారం నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజవాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు.
News February 21, 2026
ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్‌లు, 75K కాటన్ బ్లౌజ్‌లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.
News February 21, 2026
ఖమ్మం: యూట్యూబర్ మృతి.. దోస్తులే హంతకులా..?

ఈనెల 14న <<19137879>>పాలేరు జలాశయం<<>>లో కారు దూసుకెళ్లి ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని స్నేహితులే ఆయనను హతమార్చినట్లు తెలుస్తోంది. మొదట ప్రమాదమని భావించిన పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండటంతో మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితులే హతమార్చినట్లు సమాచారం. త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


