News February 12, 2025

NRPT: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రిసైడింగ్, ఓ పి ఓ లను నియమించారు. త్వరలో వీటికి మాస్టర్ ట్రైనర్ ల తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 12, 2025

బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

image

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

News February 12, 2025

కోనసీమ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో ఇంతవరకూ బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు గుర్తించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 18 పౌల్ట్రీల్లో 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని, ఎక్కడా వైరస్‌ ఆనవాళ్లు లేవన్నారు. వారం రోజుల పాటు అంగన్ వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేయాలని చెప్పారు. అయితే తూ.గో, ప.గోలో వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలు చికెన్ తినేందుకు జంకుతున్నారు. దీంతో హోటళ్లు, చికెన్ దుకాణాల్లో గిరాకీ తగ్గింది.

News February 12, 2025

JEEలో సత్తాచాటిన గుంటూరు అమ్మాయి 

image

JEE మెయిన్స్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ సత్తా చాటింది. తొలి విడత పేపర్-1 ఫలితాల్లో 100% మార్కులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నగరానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కిషోర్ చౌదరి, ప్రైవేట్ ఆసుపత్రిలో HODగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమార్తెనే సాయిమనోజ్ఞ. ఇష్టపడి విద్యను అభ్యసించడం కారణంగా 100% మార్కులు సాధించానని హర్షం వ్యక్తం చేస్తుంది. 

error: Content is protected !!