News December 29, 2024
NRPT: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం ఇవ్వాలి’
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు పోలీసులు, సెక్షన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 15 పెండింగ్ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందాల్సి ఉందని డిఎస్పీ లింగయ్య తెలిపారు.
Similar News
News December 29, 2024
దౌల్తాబాద్: వలకు చిక్కిన కొండ చిలువ
కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఇవాళ ఉదయం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకొని ఫారెస్టు ఆఫీసర్లకు అప్పగించారు.
News December 29, 2024
MBNR: కొండెక్కిన గుడ్డు ధర
ఉమ్మడి పాలమూరులో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడి గుడ్డు ధర కొండెక్కింది. నూతన సంవత్సర వేడుకల్లో కేకు తయారీలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ధర అక్టోబర్- రూ.6.30, నవంబర్- రూ.6.50, డిసెంబర్- రూ.7.10 పైన ఉంది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ధర తగ్గి గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. ధర పెరగడంతో గుడ్లు నోటికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 29, 2024
MBNR: ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. మీ ఇంటికి వచ్చారా..?
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఇప్పటికే అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.