News April 6, 2024
NRPT: ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన గర్భిణీ
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపర్డెంట్ రంజిత్ మాట్లాడుతూ.. కొల్లంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ మొదటి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షించిన అనంతరం సాధారణ ప్రసవంలోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఒకరు మగ బిడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నర్సులు ఉన్నారు.
Similar News
News January 11, 2025
MBNR: కొత్త రేషన్ కార్డులు.. చిగురించిన ఆశలు
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.
News January 11, 2025
MBNR: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద శుక్రవారం రాత్రి <<15122838>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు, లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి, క్షతగాత్రులను MBNR, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 11, 2025
MBNR: నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితా ఇలా!
MBNR-2,62,311
కొడంగల్-2,46,526
జడ్చర్ల-2,24,477
దేవరకద్ర-2,40,980
నారాయణపేట-2,38,629
గద్వాల-2,58,460
వనపర్తి-2,75,059
మక్తల్-2,48,105
కొల్లాపూర్-2,41,460
షాద్ నగర్-2,43,260
కల్వకుర్తి-2,46,523
అచ్చంపేట-2,49,620
నాగర్ కర్నూల్-2,37,422
అలంపూర్-2,41,522
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 34,54,354 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 17,10,989, మహిళలు 17,43,276, ఇతరులు 89 మంది ఉన్నారు.